అగ్నివీర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ 17 d ago
భారత సైన్యంలో నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించినట్లు రిక్రూట్‌మెంట్ అధికారి గుంటూరు డైరెక్టర్ కర్నల్ రజత్ సువర్ణ వివరించారు. గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరిధిలోని కర్నూలు, ఎస్పీఎస్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, మార్కాపురం జిల్లాలకు చెందిన అవివాహిత యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, ట్రేడ్స్‌మెన్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. వయసు గరిష్టంగా 22 ఏళ్లలోపు ఉండాలి. ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ అర్హత కలిగిన వారికి అదనపు మార్కులు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఏప్రిల్ 2. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.