America: అమెరికా షట్ డౌన్ గండం నుంచి గట్టెక్కినట్లే.. ! 1 d ago
అమెరికా షట్ డౌన్ గండం నుంచి గట్టెక్కినట్లే. ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం గడువుకు కొన్ని గంటల ముందు స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళికను ఆమోదించింది. ట్రంప్ లేవనెత్తిన డిమాండ్లను తొలగించి ఈ బిల్లును సేనేట్ కు పంపారు. అక్కడ ఆమోదం లభిస్తే అమెరికాకు షట్ డౌన్ ముప్పు తప్పినట్లే అని తెలుస్తుంది.