Ashwin: ‘అప్పుడే కొత్త నాయకులు..': అశ్విన్ పోస్ట్‌కు అర్థమేంటీ..? 5 d ago
కోట్లాది మంది భారత అభిమానుల ఆశలు నిరాశలు చేస్తూ ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్ యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ పోరాడినా.. స్టార్ ఆటగాళ్ల వైఫల్యంతో బాక్సింగ్ డే టెస్టులో టీమ్ ఇండియాకు పరాభవం తప్పలేదు. దీంతో కెప్టెన్సీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ పరిణామాల వేళ మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఛేదనలో టీమ్ ఇండియా ఇబ్బందులు పడుతున్న సమయంలో అశ్విన్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. "చెత్తకు పరిష్కారం చూపించినప్పుడే కొత్త నాయకులు ఉద్భవిస్తారు" అని రాసుకొచ్చాడు. ఆ వెంటనే మరో పోస్ట్‌లో.. "ఫ్యాన్ క్లబ్లు ఉన్న వ్యక్తుల గురించి నేను చెప్పలేదు" అని పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్‌లు వైరల్ గా మారాయి. కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించే అశ్విన్ ఈ విమర్శలు చేశాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.