BITS Campus in Amaravati: 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి బిట్స్ క్యాంప‌స్ సిద్ధం! 1 y ago

featured-image

అమరావ‌తిలో దేశంలోని ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల్లో ఒక‌టిగా పేరెన్నిక గ‌ల బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సైన్స్ (బిట్స్‌) ప్రాంగ‌ణం ఏర్పాటుకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. ఇక్క‌డ‌ త‌ర‌గ‌తులు 2026-27 విద్యా సంవ‌త్స‌రం నుంచే ప్రారంభించాల‌న్న ల‌క్ష్యంతో ఆ సంస్ధ ఉన్న‌ట్లు తెలిపింది. దాదాపు 18,500 మందికి పైగా విద్యార్ధులు రాజ‌స్థాన్‌లోని బిట్స్ పిలానీతో పాటు గోవా, హైద‌రాబాద్‌, ముంబ‌యి, దుబాయిలోని క్యాంప‌స్‌ల‌లో చ‌దువుతున్నారు. బిట్స్‌కు చెందిన మౌలిక వ‌స‌తుల బృందం దాదాపు 50 ఎక‌రాల్లో క్యాంప‌స్‌ను ఏర్పాటు చేసేందుకు ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించింది. తాజాగా బిట్స్‌కు చెందిన ఇద్ద‌రు స‌భ్యుల‌తో కూడిన అత్యున్న‌త స్ధాయి బృందం రెండో సారి అమ‌రావ‌తికి వ‌చ్చారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD