బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది..! 9 h ago
TG : నిజాంపేట లోని ఓ బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని లోని పిఠాపురానికి చెందిన కోట సత్యలావణ్య(32)కు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్ తో ఐదేళ్ల క్రిందట వివాహం జరిగింది. ఆమె బాచుపల్లి రాజీవ్ గాంధీ నగరంలోని బ్యాంకు అఫ్ ఇండియాలో సహాయ మేనేజర్ గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా బ్యాంకులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో గురువారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ టెర్రస్ పై నుండి కిందకు దూకారు. తీవ్రగాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా కొంత సమయానికి మరణించారు.