కొత్త సంవత్సరం నుంచి తాకట్టు లేకుండా రూ. 2 లక్షల రుణం.! 8 d ago
వ్యవసాయం అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తాకట్టు లేకుండా రూ. 1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా ఇటీవల దాన్ని రూ.2 లక్షలకు పెంచింది. జనవరి 1నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తాజాగా స్పష్టం చేసింది.