బిగ్ బాస్ కంటెస్టెంట్ కు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి..! 7 h ago
హిందీ బిగ్ బాస్ సీజన్ 18 గ్రాండ్ ఫినాలే వచ్చే వారం జరగనుంది. అరుణాచల్ కు చెందిన 'చుమ్ దరాంగ్' అనే కంటెస్టెంట్ టాప్ 9 లో చోటు దక్కించుకున్నందున ఆ రాష్ట్ర సీఎం ఆమెకు మధ్దతు ప్రకటించారు. అరుణాచల్ కు చెందిన 'చుమ్ దరాంగ్' టాప్ 9 లో నిలవడం సంతోషంగా ఉందనన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ఆమెకు ఓటు వేయాలని సూచిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జనవరి 19న బిగ్ బాస్ సీజన్ 18 గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది.