Mark Carney: ఏప్రిల్ 28న.. కెనడా పార్లమెంటు ఎన్నికలు 16 d ago

కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే కెనడాలోని 338 పార్లమెంటు స్థానాలకు ఏప్రిల్ 28న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.. త్వరలోనే ప్రకటన విడుదల చేయొచ్చని సమాచారం. కార్నీ కెనడా రాజధాని ఒట్టావా నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్లు.. లిబరల్ పార్టీ శనివారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. గ్లోబల్ న్యూస్ నిర్వహించిన పోల్ సర్వేల్లో ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది.