Causes of Brain Tumors: బ్రెయిన్ ట్యూమర్ రావడానికి కారణాలు ఇవే.! 1 month ago

ట్యూమర్స్ శరీరంలో ఎక్కడ ఏర్పడినా మానసికంగా, శారీరకంగా ఇబ్బందిపడుతూ ఉంటారు. అన్ని అవయవాల పనితీరును మెరుగుపరిచే బ్రెయిన్‌లో ట్యూమర్ వస్తే ప్రాణం పోయినట్లు అవుతుంది. ట్యూమర్ అంటే ఒక చికిత్స అనేదే లేకుండా, అసాధారణంగా కణాలు పెరిగిపోవటం. ఇవన్నీ ఒక చోటే ముద్దలా, కాయలా తయారవుతాయి.
సాధారణంగా మన శరీరంలోని కణాలు ఒక దశకు చనిపోతాయి, వీటిని భర్తీ చేయటానికి కొత్త కణాలు పుడతాయి. కొన్నిసార్లు పాత కణాలు చనిపోకపోయిన వాటి స్థానంలో కొత్త కణాలు పుట్టుకొస్తుంటాయి. ఇవే ఒకదగ్గర గుట్టలా ఏర్పడి చివరికి ట్యూమర్‌లా మారతాయి. బ్రెయిన్ ట్యూమర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వంశపారంపర్య రుగ్మతలు, రేడియేషన్, జీన్స్, వంటి కారణాల వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. మనం నిర్లక్ష్యం చేసే కొన్ని విషయాల వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అవి ఏంటో
ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొబైల్స్ ఎక్కువగా చూడడం
సెల్‌ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని డాక్టర్స్ సూచించారు. ఫోన్ నుంచి వచ్చే వేడి, రేడియేషన్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంతవరకు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడడం మంచిది. దీనివల్ల రేడియేషన్‌కు దూరంగా ఉండవచ్చు.
రసాయనాల కారణం వలన
పురుగుల మందులు, ద్రావణాలు, ఇతర పారిశ్రామిక రసాయనాలు ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదం పెరుగుతుంది. కెమికల్ ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతాలకు, ఫ్యాక్టరీలకు సమీపంలో నివసించే వారికి కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.
ఆహార అలవాట్ల కారణంగా:
బ్రెయిన్ ట్యూమర్ కు కొన్ని ఆహారపు అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల, పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వల్ల, బ్రెయిన్ ట్యూమర్ ముప్పు వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. మంచి ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, స్మోకింగ్‌కు దూరంగా ఉండడం వల్ల, బ్రెయిన్ ట్యూమర్ నుంచి రక్షణ పొందవచ్చు.
హార్మోన్ల కారకాలు:
బ్రెయిన్ ట్యూమర్ అభివృద్ధి చెందడానికి హార్మోన్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువకాలం పాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకున్న మహిళలకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది.
గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
వైరల్ ఫీవర్స్ కు దూరంగా ఉండాలి అంటే ఈ చిట్కాలు పట్టించండి..!