Court: థియేటర్‌లో తెలుగులో..ఓటీటీలో ఐదు భాషాల్లో కోర్ట్ 12 d ago

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి నిర్మించిన తాజా చిత్రం 'కోర్ట్. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా పలువురు కీలక పాత్ర లో నటించారు. యంగ్ డైరెక్టర్ రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 14న గ్రాండ్ గా విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ఈచిత్రాన్ని ఏప్రిల్ 11న ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ చిత్రం థియేటర్లలో తెలుగు భాషలోనే రిలీజ్ కాగా, ఓటీటీలో మాత్రం ఏకంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందు రానుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.