డీఎస్ఎస్ఎస్‌బీలో రిక్రూట్‌మెంట్ 12 d ago
దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(DSSSB), రెగ్యులర్ ప్రాతిపదికన లీగల్ అసిస్టెంట్-11, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)-33, జూనియర్ ఇంజినీర్ (సివిల్)-281, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-586 మొత్తం 911 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్హత పోస్టులను అనుసరించి డిప్లొమా/డిగ్రీ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్ధులకు రూ. 100. SC/ST పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్ధులకు ఫీజు లేదు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 25. పూర్తివివరాలకు ఇక్కడ్ క్లిక్ చేయండి.