Digestive Health Tips: ఈ ఆహార అలవాట్లు పట్టిస్తే జీర్ణ ఆరోగ్యానికి మంచిది.! 1 y ago
"జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే ఆహారపు అలవాట్లు"
అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా జీర్ణ సంబంధిత ఆరోగ్యం ప్రభావితమవుతుంది. ఈ కింది ఆహారాలు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
**యోగర్ట్**
యోగర్ట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడతాయి. యోగర్ట్ తింటే జీర్ణ సమస్యలు ఉండవు, ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
**అల్లం**
అల్లంలో అధికమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణ సమస్యలను తగ్గించి, వాంతులు మరియు వికారాన్ని నివారించటానికి సహకరిస్తుంది.
**ఓట్స్**
ఓట్స్‌లో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీనివల్ల కడుపులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి దోహదపడుతుంది.
**చియా సీడ్స్**
చియా సీడ్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను అందిస్తాయి, ఇవి కణాలకు పునరుజ్జీవనం కలిగిస్తాయి. చియా విత్తనాల వినియోగం పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది.
**అరటి**
అరటిలో అధిక ఫైబర్ మరియు ప్రీ బయోటిక్స్ ఉంటాయి, ఇవీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి.