GPI: దేశంలోని మొత్తం బ్యాంకు ఖాతాలలో 30.2% మహిళలవే... 10 d ago

దేశంలోని మొత్తం బ్యాంకు ఖాతాలలో 30.2% మహిళలవే ఉన్నాయి. అదే గ్రామీణ ప్రాంతాలలో మహిళల బ్యాంకు ఖాతాల వాటా 42.2 శాతంగా ఉందని ప్రభుత్వం ఒక నివేదిక ను వెల్లడించింది. అయితే మొత్తం డిపాజిట్ లలో మహిళల వాటా 30. 7 శాతంగా ఉంది. 'ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 సెలెక్టడ్ ఇండికేటర్స్ అండ్ డేటా' పేరు తో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఈ నివేదికను రిలీజ్ చేసింది. భారత్ లో లింగ ప్రాతిపదికన వివరాలు, జనాభా, విద్య, ఆరోగ్యం, ఆర్థిక భాగస్వామ్యం, నిర్ణయాధి కారం వంటి సూచికలు ఇందులో ఉన్నాయి. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి ఈ వివరాలను సేకరించింది. నివేదిక లోని మరిన్ని వివరాలు
2021 మార్చి 31 నుంచి 2024 నవంబరు 30 వరకు. దేశంలో డీమ్యాట్ ఖాతాలు 3.32 కోట్ల నుంచి నాలుగింతలు పెరిగి 14.30 కోట్లకు చేరుకున్నాయి. మహిళా ఖాతాల కంటే పురుషుల కన్నా మహిళల భాగస్వా మ్యంలో మంచి వృద్ధి కనిపించింది. పురుషులు డీమ్యాట్ ఖాతాలు 2.65 కోట్ల నుంచి 11.53 కోట్లకు అయితే మహిళల ఖాతాలు 66 లక్షల నుంచి 277 కోట్లకు పెరిగాయి. 2021-22 మరియు 2022-23,2023-24 లలో తయారీ, వాణిజ్యం, ఇతర సేవా రంగాలలో మహిళల నేతృ త్వంలోని సంస్థల శాతం పెరిగాయి. గతం లో 1952లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ సంఖ్య 2024 కు 97.8 కోట్లకు వచ్చింది. మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2019లో 67.2 మంది మహిళలు ఓటేయగా, 2024లో ఈ సంఖ్య 65.2 శాతానికి తగ్గింది. అయితే 2024లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటేశారు. డీపీఐఐటీ గుర్తింపు కలిగిన అంకురాలలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. 2017లో ఇటువంటివి 1943 ఉండగా, 2024లో 17,405 కు చేరింది.