Blood Pressure: రక్తపోటును తగ్గించే ఆహారాలు.? ఇవే.! 1 month ago

featured-image

బీపీ నియంత్ర‌ణ‌కు స‌హాయ‌ప‌డే ఆహారాలు


*పాలకూర, తోటకూర మొదలైన ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం అధికంగా అందుతుంది. తరచూ ఆకుకూరలు తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.


*బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే నైట్రేట్స్ రక్తప్రసరణను ఇంప్రూవ్ చేస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది.


*ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి ఓట్స్ ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉండేదుకు ఓట్స్ చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.


*అరటిపండ్లలో పొటాషియం ఉంటుంది. అరటి పండ్లను తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.


*వెల్లుల్లి బీపీ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెగ్యులర్‌గా వంటల్లో వెల్లుల్లిని వాడడం మంచిది.


*సాల్మోన్ మొదలైన చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బీపీని అదుపులో ఉంచవచ్చు.


*బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీన్స్ తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. 




గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.



బ్రెయిన్‌ ట్యూమర్‌ రావడానికి కారణాలు ఇవే.!

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD