Foods to Reduce Muscle Pain and Swelling: కండరాలు వాపు, నొప్పులు, పట్టేస్తున్నాయా? ఇవి తినండి! 1 month ago

కండరాలు పట్టేయడం వల్ల ఉండే నొప్పి కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకూ ఉండవచ్చు. చెమట పట్టడం, డీహైడ్రేషన్ వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ క్షీణిస్తే, ఈ మజిల్ క్రాంప్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది, అంటున్నారు నిపుణులు. అందుకే, తగినంత నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం, స్ట్రెచింగ్, మజిల్స్ మసాజ్, ఐస్ పాక్ అప్లై చేయడం, ఎప్సం సాల్ట్ బాత్ వంటి హోం రెమిడీస్ పాటించడం ముఖ్యమైంది. అవసరమైతే మెడికేషన్ కూడా తీసుకోవచ్చు. కండరాల నొప్పులు తగ్గించడానికి సహాయపడే కొన్ని ఆహార పదార్థాలను ఇప్పుడు చూద్దాం.
**పుచ్చకాయ**
పుచ్చకాయ కేవలం రుచిగా మాత్రమే కాకుండా, మజిల్ క్రాంప్స్ నుండి రిలీఫ్ ఇచ్చే అద్భుతమైన ఆహారం. ఇందులో నీరు, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎలెక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేస్తాయి. అలాగే, పుచ్చకాయలో ఉన్న సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ బ్లడ్ ఫ్లోని మెరుగుపరుస్తుంది.
**అవకాడో**
అవకాడోలో మంచి కొవ్వులు, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలెక్ట్రోలైట్స్ ఉన్నాయి. ఇవి మజిల్ క్రాంప్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
**కొబ్బరి నీరు**
కొబ్బరి నీటిలో పొటాషియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సహజంగా లభిస్తాయి. ఈ పానీయం ప్రకృతి ఇచ్చిన రుచి మరియు ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందింది. మజిల్ క్రాంప్స్ నుండి రిలీఫ్ అందించడం సహజ లక్షణం. ఇందులోని అమైనో యాసిడ్స్ ఒత్తిడి తగ్గించి, మజిల్ రికవరీకి మద్దతు ఇస్తాయి.
**అరటి పండు**
ఫిట్నెస్ ప్రియులు మజిల్ క్రాంప్స్ రాకుండా ఉండటానికి అరటి పండ్లు తింటారు. ఇది తక్షణ శక్తిని అందించడంతో పాటు, వర్కౌట్ ముందు తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది. అరటి పండులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కారణంగా ఎలెక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయిన్‌టైన్ అవుతుంది, తద్వారా మజిల్ క్రాంప్స్ నివారించబడతాయి.
గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
ఈ వ్యాయామాలను చేస్తే చాలు వెన్ను నొప్పి ఇట్టే తగ్గిపోతుంది..!