Sameer S. Nadkarni: భారత్ కు చెందిన వ్యక్తిపై అమెరికాలో కేసు నమోదు 9 d ago

భారత్ కు చెందిన వ్యక్తిపై అమెరికాలో కేసు నమోదు అయ్యింది. గ్యాంబ్లింగ్ కేసు నమోదు చేసినట్లు అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని లాంగువుడ్ లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తి సమీర్ ఎస్. నాదకర్ణిపైనా కేసు నమోదైంది. స్పోర్ట్స్ బుక్ సబ్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నందువల్ల అతడిపై అభియోగాలు నమోదైనట్లు.. అభియోగాలు మోపబడిన 39 మంది వ్యక్తులలో ఆయన ఒకరు అని తెలిపారు. దాదాపు 3 మిలియన్ డాలర్ల వరకు బెట్టింగ్లు చేసారని పేర్కొన్నారు. చట్టబద్ధంగా నిర్వహిస్తున్న పలు రెస్టరెంట్లు, సామాజిక క్లబ్ లో ఈ నేరాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు.