Gavaskar: పంత్ పై గవాస్కర్ అసహనం 8 d ago
అప్పటికే సగం వికెట్లు కోల్పోయిన జట్టును కాపాడాల్సిన బాధ్యత ఉన్నా సరే, రిషభ్ పంత్ (28) ఏమాత్రం పట్టించుకోలేదు. తన మార్క్ షాట్లను ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో బోలాండ్ బౌలింగ్ లో ర్యాంప్ షాట్‌ను కొట్టేందుకు ప్రయత్నించి విఫలమైన రిషభ్ పంత్ ఔటయ్యాడు. దీంతో కామెంట్రీ బాక్స్ లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అత్యంత చెత్త షాట్ అంటూ పంత్ ను భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లొద్దని వ్యాఖ్యానించాడు. "స్టుపిడ్ షాట్.. స్టుపిడ్ షాట్. అతడు భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లొద్దు. ఇతర డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లాలి" అని మండిపడ్డారు.