Hasina: త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తాను 15 d ago

దేవుడు తనను ఏదో ఒక కారణం చేత ఇంకా బతికించాడని, త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అవామీ లీగ్ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నవారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆమె హెచ్చరించారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ తీవ్ర విమర్శలు చేశారు. అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి ఆయన విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ఆరోపించారు. యూనస్ వల్ల దేశానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.