LSG vs PBKS: వరుసగా రెండో విజయంతో పంజాబ్ కింగ్స్... మళ్లీ విఫలమైన రిషబ్ పంత్.! 6 d ago

IPL 2025 లో భాగంగా 13వ మ్యాచ్ లక్నోలోని ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగింది. లక్నో సొంత గడ్డలో పంజాబ్.. లక్నోపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఏకపక్షంగా కొనసాగింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన విన్నింగ్ స్ట్రీక్ ను కొనసాగిస్తున్నాడు. వరుసగా 8 విజయాలు సాధించిన కెప్టెన్‌గా అయ్యర్.. ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. వరుసగా రెండు విజయాలతో పంజాబ్ కింగ్స్ టేబుల్ టాప్-2 కు చేరింది. పంజాబ్ పై ఓటమితో లక్నో 6వ స్థానానికి పడిపోయింది.
తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున న్యూజిలాండ్ పేసర్.. లుకీ పెర్గూసన్, ఆఫ్ఘనిస్తాన్ పేసర్ అజ్మతుల్లా స్ధానంలో ఎంట్రీ ఇచ్చాడు. అనుకున్నట్టుగానే పంజాబ్ బౌలర్లు.. పవర్ ప్లే లో కట్టడి చేశారు. మొదటి ఓవర్ లోనే అర్ష్‌దీప్ సింగ్..మిచెల్ మార్ష్ ను (0) సున్నాకి ఔట్ చేసాడు.
ఈ మ్యాచ్‌లో ఫార్మ్ లోకి వచ్చిన ఎయిడెన్ మార్క్‌రామ్ (28) కూడా ఎక్కువసేపు నిలబడలేక పోయాడు. క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (2) కూడా అదే బ్యాటింగ్ వైఫల్యాన్ని కనపరిచాడు. IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన పంత్.. అసలు ఆటలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ దెబ్బతో లక్నో 35 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
టీం కష్టాల్లో ఉన్న సమయంలో నికోలస్ పూరన్ (44), ఆయుష్ బడోని (41) మధ్య 54 పరుగుల భాగస్వామ్యంతో టీం ను ఆదుకున్నారు. మిల్లర్ (19) కూడా తన ఆట తీరును సరిగ్గా ఆడలేదు. చివరిలో అబ్దుల్ సమద్ 12 బంతుల్లో 27 పరుగులు చేసి లక్నోకు తగినంత స్కోరును చేర్చాడు. చివరి ఓవర్లో పంజాబ్ బౌలర్లు విజృంభించడంతో లక్నో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
బరిలోకి దిగిన పంజాబ్ బ్యాటర్ లు చెలరేగి ఆడారు.. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (8) తక్కువ పరుగులకే ఔట్ అయినా.. మిగతా బ్యాటర్లు ఏమాత్రం జోరు ఆపలేదు. శ్రేయాస్ అయ్యర్ (52), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (69) చెలరేగి ఆడారు. వీళ్లిద్దరు కలిసి 44 బంతుల్లో 84 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ వన్-సైడ్ అయిపోయింది.
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వికెట్ పడ్డ పెద్ద ఇంపాక్ట్ చూపించలేక పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన నేహాల్ వధేరా (43) వేగంగా ఇన్నింగ్స్ ను ముగించాడు. దీంతో 16.2 ఓవర్లలోనే పంజాబ్ 177 పరుగులు చేసింది. వరుస విజయాలతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. పంజాబ్ జట్టు మేనేజ్‌మెంట్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలపెట్టుకున్నాడు.
టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.