CSK vs PBKS: చెన్నై బౌలర్లపై చెలరేగిన భారత యువ బ్యాటర్.. మళ్లీ ఓడిన చెన్నై.! 14 d ago

featured-image

IPL 2025 భాగంగా మంగళవారం జరిగిన రెండవ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS).. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లోనే సెంచరీ చేసిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్‌.. ప్రియాన్స్ ఆర్య ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.


ఈ సెంచరీతో IPL 2025లో ఇషాన్ కిషన్ తర్వాత సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న.. ఒంటి చేతితో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగోవ స్థానానికి చేరుకుంది. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య మొదటి బంతికే సిక్స్ కొట్టి ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. కానీ మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఖాతా తెరవకుండానే రెండవ ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన నలుగురు బ్యాటర్లు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

శ్రేయస్ అయ్యర్‌ (9), మార్కస్ స్టోయినిస్ (4), నేహాల్ వధేరా (9), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఇక ఈ సమయంలో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పంజాబ్ జట్టు కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా సరే ఈ 24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్య ఏమాత్రం ఆగలేదు... ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.


13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. దీంట్లో ఒక వంద పరుగులు ప్రియాన్ష్ ఆర్య (103) ఒక్కడే చేసాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ (52).. మార్కో జాన్సెన్ (34) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్ కింగ్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. టీం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రియాన్స్ ఆర్య ఆదుకున్నాడు.. IPL లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండవ భారతీయుడిగా ప్రియాంష్ రికార్డులకెక్కాడు.


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు కూడా తమ గేర్ మార్చారు. రచిన్ రవీంద్ర (23), డెవాన్ కాన్వే (69) శరవేగంగా బ్యాటింగ్ చేశారు. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు టీం కు కావాల్సిన ప్రారంభాన్ని అందించారు. కానీ రచిన్ ఔట్ అయినా తరువాత బరిలోకి వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆ తరువాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శివమ్ దూబే (42) మెరుపులు పుట్టించాడు.


కాన్వే.. దూబే భాగస్వామ్యంతో ఒక దశలో మ్యాచ్ చెన్నై వైపే అనిపించింది. కానీ దూబే ఔట్ కావడంతో మ్యాచ్ తిరిగిపోయింది.. కాన్వే కూడా రిటైర్డ్ అవుట్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ధోనీ.. జడేజా క్రీజులో ఉన్నారు.. ఇంకా మ్యాచ్ CSK దే అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ధోనీ (12 బంతుల్లో 27 రన్స్) బ్యాట్ ఝుళిపించినా.. అప్పటికే ఆలస్యమైపోయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 


టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.



Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD