YS Jagan: ఏపీలో రెడ్‌బుక్ పాలన 10 d ago

AP: ఏపీలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతి గ్రామంలో మద్యం, బెల్టు షాపులు, పేకాట క్లబ్‌లు, ఇసుక, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయన్నారు. కూటమి నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఆరు నెలలు గడవక ముందే ప్రజలకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రజలకు వైసీపీ కార్యకర్తలు అండగా నిలవాలన్నారు. వైసీపీ శ్రేణులు, నాయకులు కలిసికట్టుగా ముందుకు నడుస్తూ, గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలవాలని పేర్కొన్నారు. సంఖ్య బలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని సీఎం చంద్రబాబు అధికార అహంకారం చూపుతున్నారన్నారు. రాష్ట్రంలో 57 చోట్ల స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగితే, ఈ ఎన్నికల్లో కూటమి నాయకులు గెలిచే అవకాశం లేక ఏడు చోట్లు వాయిదా వేశారన్నారు. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైసీపీ గెలిచిందని, వైసీపీ క్యాడర్‌ను చంద్రబాబు ఏమీ చేయలేకపోయారన్నారు.