ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ..! 17 h ago
TG : ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు. ఇది అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పానన్నారు. మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని కేటీఆర్ చెప్పారు. ఈ విచారణకు కేటీఆర్ తరఫు న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు. విచారణ సందర్భంగా పలు అంశాలను ఏసీబీ చర్చకు తెచ్చింది. కేసు సంబంధిత ప్రధాన విషయాలను కేటీఆర్ ముందుంచినట్లు సమాచారం.