Kaveri Engine: స్వదేశీ విమాన ఇంజన్ కావేరీ..! 9 d ago
గగనతల సాంకేతికతకు సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో భాగంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ ఇంజన్ ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చిందని, పరీక్షలకు కావేరీ ఇంజన్ సిద్ధమైందని డీఆర్డీవో ప్రకటించింది. డీఆర్డీఓ పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్(GTRE) ఈ ఇంజన్‌ను అభివృద్ధి చేసింది. యుద్ధవిమానాలకు అవసరమైన ఇంజన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాలన్న లక్ష్యంతో కావేరీ ఇంజన్ ప్రాజెక్టు 1980లో ప్రారంభమైంది. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. వాటన్నింటినీ అధిగమించి చివరకు స్వదేశీ విమాన ఇంజన్ రూపుదాల్చింది. తదుపరి దశలో భాగంగా కావేరీ ఇంజన్ ను పలు విమానాల్లో, పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. వాటిలో కూడా విజయవంతమైతే విమాన ఇంజన్ల కోసం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.