ఢిల్లీ నేర రాజధానిగా.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు..! 7 h ago
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దిల్లీలో 25 ఏళ్లుగా బీజేపీకి అధికారం దక్కలేదు కాబట్టే, ప్రజలపై ద్వేషం పెంచుకుందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం దిల్లీని "భారతదేశానికి నేర రాజధాని"గా మారుస్తుందని వ్యాఖ్యానించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, గ్యాంగ్ వార్‌లు ఎక్కువైన నేపథ్యంలో, మహిళలు ఇంటి నుండి బయటకు వెళ్లడానికి భయపడుతున్నారని ఆరోపించారు.