Koneru hampi: 2024 ఫిడె వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్షిప్ విజేతగా కోనేరు హంపి...! 6 d ago
న్యూయార్క్ వాల్ స్ట్రీట్ లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ షిప్-2024, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ మహిళల విభాగంలో భారత స్టార్ చెస్ క్రీడాకారిణి, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచారు. 2019లో తొలిసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ సాధించిన హంపికి ఇది రెండో ప్రపంచ ర్యాపిడ్ టైటిల్. దీంతో, వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిచిన క్రీడాకారులలో చైనా క్రీడాకారిణి జు వెంజున్ తర్వాతి స్థానంలో హంపి నిలిచారు. వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో 2012లో కాంస్యం, 2023లో రజతం సాధించారు. హంపి 2003లో అర్జున అవార్డు.. 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను ఆమె 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్' అవార్డ్ను గెలుచుకున్నారు. అండర్ 10, 12, 14 వరల్డ్ యూత్ చాంపియన్ షిప్లనూ ఆమె గెలుచుకోవడంతో ఆమె ఉమన్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్షిప్స్ నాలుగుసార్లు టాప్- 3లో నిలిచిన గ్రాండ్‌మాస్టర్ ఘనతను హంపి సొంతం చేసుకున్నారు. ఇటీవల దొమ్మరాజు గుకేశ్ ఫిడె ప్రపంచ చాంపియన్ గా చరిత్ర సృష్టించాడు.