MA Baby: SFSI ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన MA బేబీ... 16 d ago

featured-image

సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మరియం అలెగ్జాండర్ బేబీ ఎన్నికయ్యారు. సీపీఎం 24వ అఖిల భారత మహా సభలు మదురైలో ఏప్రిల్ 2న నుంచి జరుగుతున్నాయి. చివరి రోజైన ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికైనట్లు కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. సీతారాం ఏచూరి మరణానంతరం ఆ పదవికి ఎంపి బేబీ ఎన్నిక కావడంతో పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, పాఠశాల విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచే ఎం. ఎ.బేబీ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ వచ్చారు. కేరళలోని ప్రక్కుళంలో పి.ఎం. అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ దంపతులకు 1954లో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అక్కడే చేశారు. కాగా, బడిలో ఉన్నప్పుడే కేరళ విద్యార్ధి సమాఖ్య'లో చేరారు.

రాజనీతిశాస్త్రంలో బీఏ కోసం కొల్లంలోని కళాశాలలో చేరినా దానిని పూర్తిచేయలేదు. అనంతరం SFSI, DYFSIలలో వివిధ పదవుల్లో కొనసాగారు. 1988-98 మధ్య సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడిగాను.. అలాగే 2006-16 మధ్య రెండు విడతలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2011 వరకు ఐదేళ్లపాటు కేరళ విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాగా, 2012 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కానీ, 2014లో లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో రక్కు చెందిన యువ నాయకుడు ఆర్. అరుణ్ కుమార్ కు చోటు లభించింది. దీంతో ప్రస్తుత పొలిబబ్యూరోలో బీవీ రాఘవులుతో పాటు ఇద్దరు తెలుగువారికి చోటు దక్కినట్లయింది.

కాగా, "అరుణ్ కుమార్ 1974 అక్టోబర్ లో జన్మించారు. ఈ క్రమంలో పాఠశాల విద్య మచిలీపట్నంలో, డిగ్రీ, విజయవాడలో సాగింది. అలాగే హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో చరిత్రలో పీజీ చేశారు. 1998-2002 వరకు SFSI ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాదు.. అరుణ్ కుమార్ తల్లి హేమలత సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. పాలిటీబ్యూరోలోకి కొత్తగా చేరిన విజూకృష్ణన్ ఖమ్మం జిల్లాకు చెందిన కుంటుంబ సబ్యులకు అల్లుడు. ఆయన ఢిల్లీలో జేఎన్ యూలో చదువుతుండగా ఖమ్మం జిల్లాకు చెందిన మల్లెంపాటి సమతను వివాహమాడారు. ఇక కేరళకు చెందిన ఈయన ప్రస్తుతం ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

పార్టీ కేంద్ర కమిటీలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదివరకు ప్రాతినిధ్యం వహించిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ను తప్పించి ఆ స్థానంలో కొత్తగా గుంటూరుకు చెందిన మహిళా నాయకురాలు ధూళిపాళ్ల రమా దేవి, విశాఖపట్నానికి చెందిన కొత్తపల్లి లోకనాథానికి స్థానం కల్పించారు. వీరిద్దరూ ప్రస్తుతం సీపీఎం సభ్యులుగా ఉన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస కార్యదర్శివర్గంలో ఉన్నారు. వీరితోపాటు కేంద్ర కమిటీ రావు, మహిళానాయకురాలు ఎస్. పుణ్యవతి యథాత ధంగా కొనసాగుతున్నారు. తమిళనాడు నుంచి పొలిట్ బ్యూరో సభ్యులుగా కె. బాలకృష్ణన్, వాసుకి చోటు దక్కించుకున్నారు. 84 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటు చేయగా అందులో తమిళనాడు నుంచి షణ్ముగం, సంపత్, గుణశేఖరన్ స్థానం పొందారు.

తెలంగాణకు గతంలో కంటే సీపీఎం కేంద్ర కమిటీలో కొంత ప్రాధాన్యం పెరిగింది. ఆదివారం ప్రకటించిన సీపీఎం కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎస్. వీరయ్య, టి. జ్యోతి, సాయిబాబాకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో వయోపరిమితి రీత్యా ఆరుగురి నిష్క్రమణ పార్టీ కేంద్రకమిటీ నుంచి 75 ఏళ్ల వయసు వచ్చిన వారిని తప్పించాలని 2022లో సీపీఎం తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ పాలిట్బ్యూరో నుంచి అరుగురు సీనియర్ నేతలు నిష్క్రమించారు. ఇక పార్టీ మాజీ ప్రధాన సభ సభ్యురాలు బృందాకారాట్ కూడా ఉన్నారు. అలానే కేరళ కార్యదర్శి ప్రకాశ్ కారాట్, ఆయన సతీమణి, మాజీ రాజ్యా సీఎం పినరయి విజయన్ 75 ఏళ్ల వయోపరిమితి దాటి నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారన్న కారణంతో ఆయన్ను మాత్రమే కొనసాగించారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD