Stock Market: హ్యాట్రిక్ లాభాలతో స్టాక్ మార్కెట్..! 23 d ago
8K News-10/02/2026 భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఇవాళ సెన్సెక్స్ 208.17 పాయింట్లు (0.25%) పెరిగి 84,273.92 వద్ద ముగియగా, నిఫ్టీ 67.85 పాయింట్లు (0.26%) లాభపడి 25,935.15 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా మీడియా, ఆటో రంగాలు 1%-2% వరకు పెరుగుతూ మార్కెట్‌కు ఊపు ఇచ్చాయి. మొత్తం 2,456 షేర్లు లాభాల్లో ముగియగా, నష్టాల్లో ముగిసినవి 1,605 మాత్రమే. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 0.4% చొప్పున పెరిగి మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి