Australia: మిచెల్ మార్ష్ స్థానంలో మరో ఆల్రౌండర్ 4 d ago
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ తో జరగనున్న ఐదో టెస్టు కోసం ఆస్ట్రేలియా తుది జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఇబ్బందిపడుతున్న మిచెల్ మార్ష్ స్థానంలో మరో ఆల్రౌండర్ ను ఎంపిక చేసింది. బ్యూ వెబ్స్టర్ ను టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. దీంతో ఒకే సిరీస్లో ఆసీస్ తరఫున ముగ్గురు కొత్త ఆటగాళ్లు టెస్టుల్లో డెబ్యూ చేయడం గమనార్హం. ఇప్పటికే మెక్స్వినీ, సామ్ కొన్స్టాస్ ఆడిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో భారత్, ఆసీస్ ఆడబోయే మొదటి టెస్టు కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంతో కొనసాగుతున్న ఆసీస్ ఇక్కడా గెలిచి పదేళ్ల తర్వాత స్వదేశంలో బీజీటీని దక్కించుకోవాలని చూస్తుండగా.. మరోవైపు టీమ్ ఇండియా సిరీస్ ను సమం చేసి స్వదేశానికి వెళ్లాలని భావిస్తుంది.