Moto: "Moto G04s" సింపుల్ కాదు.. సూపర్ స్మార్ట్‌ఫోన్! 11 month ago
బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో మోటోరోలా ఒకటి. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే ఫోన్లు తయారుచేయడంలో మోటోరోలా No.1 అనే చెప్పాలి. ఫ్యాన్సీ ఫీచర్లు లేకుండా..అతితక్కువ ధరలో అదిరిపోయే Moto G04s ఫోన్‌ని తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లో పెద్ద స్క్రీన్, శక్తివంతమైన బ్యాటరీ.. మంచి కెమెరా కూడా ఉన్నాయి. సింపుల్ డిజైన్ తో చాలా బాగుంటుంది ఈ ఫోన్. మరెందుకు ఆలస్యం ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి!
Moto G04s ఫీచర్లు:
ప్రాసెసర్: Unisoc T606
డిస్‌ప్లే: 6.6-అంగుళాల HD+ IPS LCD
రిఫ్రెష్ రేట్: 90Hz
బ్యాక్ కెమెరా: 50MP మెయిన్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 5000mAh
ఛార్జింగ్: 15W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 14
4GB RAM + 64GB స్టోరేజ్.. Expandable upto 1 TB
కనెక్టివిటీ ఫీచర్లు:
- బ్లూటూత్ 5.0
- USB టైప్-C పోర్ట్
- Wi-Fi 5
- 4G డ్యూయల్ సిమ్
ఇతర ఫీచర్లు:
- సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- 3.5mm ఆడియో జాక్
- డాల్బీ అట్మోస్
ఫోన్ రంగులు:
- శాటిన్ బ్లూ
- కాంకర్డ్ బ్లాక్
- సన్‌రైజ్ ఆరంజ్
లోపాలు:
Unisoc T606 ప్రాసెసర్ కారణంగా ఇది గేమింగ్ కి పెద్దగా బాగోదు. ఈ ఫోన్ కేవలం ఒక వేరియంట్ తోనే వస్తుంది. తక్కువ రిజల్యూషన్ వల్ల వీడియోలు, ఫోటోలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఈ ఫోన్ కు 5G నెట్‌వర్క్ సపోర్ట్ లేదు.
Moto G04s రోజువారీ సాధారణ అవసరాలకు సరిపోతుంది. పెద్ద స్క్రీన్, రోజంతా వచ్చే బ్యాటరీ.. తక్కువ ధరలో కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక. ఇది తక్కువ ధరలో లభించే ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ధర రూ.7,999 నుండి ప్రారంభం అవుతుంది.. బ్లాక్ కలర్ కావాలంటే ఒక వెయ్యి ఎక్కువ పెట్టాల్సిందే. అన్ని స్టోర్లలో అందుబాటులో ఉంది.
ఇది చదవండి: Oppo K12X బడ్జెట్ ధరకే .. భారీ ఫీచర్లతో 5G మొబైల్.!