గ్యాంగ్‌స్టర్‌ను పట్టించిన 'పుష్ప 2' సినిమా..! 9 h ago
నాగ్‌పూర్‌లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో 'పుష్ప 2' చూస్తుండగా గ్యాంగ్‌స్టర్ విశాల్ మేశ్రాంను పోలీసులు అరెస్ట్ చేసారు. పది నెలలుగా విశాల్ మేశ్రాం పరారీలో ఉన్నారు. 'పుష్ప 2' సినిమాపై ఉన్న ఆసక్తితో ఖచ్చితంగా చూసేందుకు వస్తాడన్న పక్కా సమాచారంతో పాంచ్ పావలీ పోలీసులు నిఘాపెట్టి అరెస్ట్ చేసారు. విశాల్ మేశ్రాంపై రెండు హత్యలు, డ్రగ్స్ అక్రమ రవాణా, హింసాత్మక ఘటనలతో పాటు మొత్తం 27 కేసులు ఉన్నాయి.