Blockchain: మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ చైన్ ను వాడేందుకు కసరత్తు..! 14 d ago

భూవ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల కార్యకలాపాలను బ్లాక్ చైన్ టెక్నాలజీతో అనుసంధానించనుంది. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన కొన్ని మండలాల్లో రానున్న ఆరు నెలలపాటు భూరికార్డుల నిర్వహణకు బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించనుంది. అయితే, ఈ సాంకేతికతను మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వాడేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వెబ్ ల్యాండ్ లో ఉన్న లొసుగుల ఆధారంగా రెవెన్యూ ఉద్యోగులు తమకు ఇష్టమొచ్చిన వారి పేర్లను ఎక్కించి భూ అక్రమాలకు ఊత మిస్తున్నారు.
ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూముల యజమానుల పేర్లనూ మర్చి.. విస్తీర్ణాలను తగ్గిస్తున్నారు. కాగా, తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారుల డిజిటల్ సిగ్నేచర్ను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ మేరకు డేటాఎంట్రీ ఆపరేటర్ లు సైతం వివరాల నమోదులో అక్షమాలకు పాల్పడుతున్నారు. అలానే నిషిద్ధ జాబితా నుంచి ఫ్రీహోల్డ్ భూములను తప్పించే క్రమంలో ఇలాగే ఆయా స్థాయిల్లో ఐదు లక్షల ఎకరాల వరకు ఆక్రమంగా తప్పించారు. అంతేకాదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడకం వల్ల నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితానుంచి భూములు తప్పించేందుకు వీలుండదు.
ఈ సాంకేతికత వాడకంతో భూకార్యకలాపాలకు సంబంధించిన బ్లాక్ చైన్ న్నీ అనుసంధానమవుతాయి. అయితే, కేంద్రీ కృత డేటా బేస్ ఉండదు. ఈ నేపథ్యంలో లావాదేవీలన్నీ సురక్షితంగా ఎన్ క్రిప్ట్ చేయడం వల్ల నమోదైన సమాచారాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, అలా చేస్తే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా వివరాలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారో స్పష్టంగా తెలుస్తుంది. అనుమానాస్పదంగా వివరాల నమోదైన లేదా మార్చేందుకు ప్రయత్నించిన ఆన్ లైన్ లో వెంటనే కనిపెట్టేందుకు వీలవుతుంది. అయితే, భూముల వ్యవహారాల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ తప్పనిసరన్న ఉద్దేశంతో అమలుపై ఉన్నతస్థాయిలో కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సవాలుగా ఉన్న సమస్యల్లో మ్యుటేషన్ ఒకటి. ఈ క్రమంలో భూములు చేతులు మారినప్పుడు యాజమాన్య మార్పునకు మ్యుటేషన్ కోసం సచివాల దరఖాస్తు చేస్తున్నారు. వీటిపై తొలుత క్షేత్రస్థాయిలో VRO పరిశీలిస్తున్నారు. ఆయన నుంచి రెవెన్యూ ఇన్ స్పెకర్ , తరువాత తహసీల్దారులకు సిఫారసు నోటీసు వెళుతోంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ నిర్ణయాన్నిబట్టి దరఖాస్తుదారులకు పట్టాదారు పాసుపుస్తకాలనిస్తున్నారు.
కాగా, యాజమాన్య మార్పునకు తగ్గట్టు సుమారు 10 నుంచి 15 పేజీలతో దస్త్రం రూపొందుతోంది. వీటి వివరాలను ఆన్ లైన్ లో సంక్షిప్తంగానే నమోదు చేస్తున్నారు. కానీ, వివాదాస్పదమైనప్పుడు క్షేత్రస్థాయి అధ్యయన నివేదికలు అందుబాటులో ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో మ్యుటేషన్ చేయడానికి ముందు పలు స్థాయిల సిబ్బంది నివేదికలు, ఇతర సమాచారాన్ని కొత్త సాంకేతిక సాయంలతో ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తారు. ఈ నివేదికలను RDO, జేసీ స్థాయిలో ఎప్పటికప్పుడు చూసేందుకు వీలుంటుంది.