Oppo K13: భారత మార్కెట్లోకి రానున్న ఒప్పో కొత్త ఫోన్.. 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ తో "ఒప్పో K13 5G" 1 y ago
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Oppo తన సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ Oppo K13 5Gని ఏప్రిల్ 21న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ యొక్క కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్లను వెల్లడించడంతో.. ఇది భారతీయ మార్కెట్లోని మిడ్-రేంజ్ వినియోగదారులకు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారనుంది. ప్రత్యేకించి దీని డిజైన్, కెమెరా నాణ్యత మరియు ఇతర ఫీచర్లు విడుదల ముందే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోన్ గురించి మరిన్ని ముఖ్యమైన ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి...!
Oppo K13 ఫీచర్లు:
డిస్ప్లే: 6.67 అంగుళాలు AMOLED స్క్రీన్
రిఫ్రెష్ రేట్: 120 Hz
పీక్ బ్రైట్నెస్: 1200 nits
ప్రాసెసర్: Qualcomm Snapdragon 6 Gen 4
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15, ColorOS 15
బ్యాటరీ: 7000 mAh
ఛార్జింగ్: 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
బరువు: 208 గ్రాములు
బ్యాక్ కెమెరా: 50 MP మెయిన్ కెమెరా
8 GB RAM + 256 GB స్టోరేజ్
కనెక్టివిటీ ఫీచర్లు:
- 5G, 4G డ్యూయల్ సిమ్ (అంచనా)
- Wi-Fi 6
- బ్లూటూత్ 5.4
- USB Type-C
- IR బ్లాస్టర్
ఇతర ఫీచర్లు:
- ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- స్టీరియో స్పీకర్లు
- IP65 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్
- గ్రాఫైట్ షీట్ & వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్
కలర్ ఆప్షన్స్:
- ఐసీ పర్పుల్
- ప్రిజమ్ బ్లాక్
ప్లస్ పాయింట్స్:
- 7000 mAh బ్యాటరీ కెపాసిటీ
- వేగవంతమైన 80W ఫాస్ట్ ఛార్జింగ్
- 50 MP AI బ్యాక్ కెమెరా
- IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
మైనస్ పాయింట్స్:
- NFC లేదు
- ఎక్కువ వేరియంట్లు ఉండకపోవచ్చు
- కెమెరా సెటప్ అంత ఆకర్షణీయంగా లేదు
Oppo K13 మొబైల్ త్వరలోనే భారత్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ ముఖ్యంగా భారీ బ్యాటరీ మరియు శక్తివంతమైన ప్రాసెసర్‌తో గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఈ ఫోన్ గురించిన పూర్తి వివరాలు ..Oppo సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఏప్రిల్ 21.. 2025న విడుదల కానున్న ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర సుమారు రూ.20,000 లోపు ఉండవచ్చని లీక్స్ ద్వారా తెలుస్తుంది.
ఇది చదవండి: గేమింగ్ కోసం అత్యాధునిక టెక్నాలజీ.. గేమింగ్ ప్రియులకు అత్యుత్తమ ఎంపిక!