PO: పోస్టల్ జాబ్స్‌కు ముగియనున్న దరఖాస్తు గడువు 19 d ago
దేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వ తపాలా శాఖ వివిధ పోస్టల్ సర్కిళ్ల లో 28,638 జీడీఎస్ పోస్టుల భర్తీకి చేపట్టిన దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసే విషయం తెలిసిందే. మొత్తం ఖాళీలలో ఆంధ్రప్రదేశ్‌కు 1060, తెలంగాణకు 608 పోస్టులను కేటాయించారు. విద్యార్హత టెన్త్. ఎంపిక ప్రక్రియ పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఫిబ్రవరి 16. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.