Realme P3 Pro అదిరిపోయే ఫీచర్లుతో.. అదరకొట్టే స్మార్ట్‌ఫోన్.! 17 d ago

featured-image

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రియల్‌మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు అందించడంలో ఈ కంపెనీ ముందుంటుంది. ఇప్పుడు Realme P3 Pro పేరుతో మరో అదిరిపోయే ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ పెర్ఫార్మన్స్ కి, డిజైన్ కి పెట్టిన పేరు. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండటంతో.. ఈ ఫోన్ కు మరింత క్రేజ్ పెరిగింది. Realme P3 Pro గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి!


Realme P3 Pro ఫీచర్లు:

డిస్‌ప్లే: 6.8-inch FHD+ AMOLED స్క్రీన్

రిఫ్రెష్ రేట్: 120Hz

పీక్ బ్రైట్‌నెస్: 1500 నిట్స్

ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3

బ్యాటరీ: 6000mAh

ఛార్జింగ్: 80W సూపర్ ఛార్జింగ్

వెయిట్: 190 గ్రాములు

బ్యాక్ కెమెరా: 50 MP + 2 MP

ఫ్రంట్ కెమెరా: 16 MP


వేరియంట్స్:

  • 8GB RAM + 128GB స్టోరేజ్
  • 8GB RAM + 256GB స్టోరేజ్
  • 12GB RAM + 256GB స్టోరేజ్


కనెక్టివిటీ ఫీచర్లు:

  • బ్లూటూత్ 5.2
  • Wi-Fi 6E
  • USB టైప్-C పోర్ట్


సాఫ్ట్‌వేర్ వెర్షన్: ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ -15 తో వస్తుంది.


P3 Pro రంగులు:

  • గెలాక్సి ప‌ర్‌పుల్‌
  • శాట‌ర్న్ బ్రౌన్‌
  • నెబ్యూలా గ్లో


ఫోన్ ధరలు:

  • 8GB RAM, 128GB స్టోరేజ్-- రూ.23,999
  • 8GB RAM, 256GB స్టోరేజ్-- రూ.24,999
  • 12GB RAM, 256GB స్టోరేజ్-- రూ.26,999


లోపాలు:

ఈ ఫోన్ లో ఏదైనా లోపం ఉందంటే అది కెమెరా ఒకటే. ఇతర ఫోన్లతో పోలిస్తే..దీని కెమెరా చాల తక్కువనే చెప్పాలి. దీనికన్నా తక్కువ ధరకే Motorola Edge 50 Neo లో అద్భుతమైన కెమెరా ఫీచర్స్ ఉన్నాయి.. 


రియల్‌మీ P3 ప్రో ఫిబ్రవరి 18న లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్లైన్ తో పాటు ఆఫ్‌లైన్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వాటర్ ప్రూఫ్ కూడా..అలాగే ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి వాటికి మంచి అనుభవాన్ని అందిస్తుంది. రియల్‌మీ P3 ప్రో బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునేవారికి సూపర్ ఎంపిక.


ఇది చదవండి: OPPO F29 Pro 5G: అండర్​వాటర్ ఫొటోగ్రఫీతో.. అన్‌లిమిటెడ్ ఫోటోలు.!

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD