వాళ్ళు చేసిన అప్పులు చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేస్తున్నాం..! 1 d ago
TG: అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ఏడాదిలో రూ. లక్ష 27 వేల కోట్ల అప్పు చేస్తే రాష్ట్రం మొత్తం అప్పు రూ. 8 లక్షల 38 వేల కోట్లు ఉండాలని అన్నారు. కానీ, నేడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు రూ. 7 లక్షల 22 వేల కోట్లు అని స్పష్టం చేసారు. ప్రతినెలా రూ. 6 వేల 500 కోట్ల అప్పులు కడుతున్నామని వెల్లడించారు. వాళ్ల లెక్క మేము అప్పులు తెచ్చి గజ్వేల్, మొయినాబాద్, జాన్వాడ లో ఫామ్ హౌజ్ లు కట్టుకోలేదని విమర్శించారు. వాళ్ళు చేసిన అప్పులు చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.