Muhammad Rizwan: ఇంగ్లీషే ముఖ్యమైతే క్రికెట్ వదిలి ప్రొఫెసర్ అయ్యేవాడిని..! 6 d ago

పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తన ఇంగ్లీష్‌పై జరుగుతున్న ట్రోలింగ్ కు స్పందించాడు. తాను చదువు పూర్తిచేయలేదని, అందుకే ఇంగ్లీష్ బాగా రాదని చెప్పాడు. ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం తనకు సిగ్గేమీ కాదని, తన పని క్రికెట్ ఆడడం, ఇంగ్లీష్ మాట్లాడటం కాదని స్పష్టం చేశాడు. "ఇంగ్లీషే ముఖ్యమైతే, క్రికెట్ వదిలి ప్రొఫెసర్ అయ్యేవాడిని" అంటూ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలు సామజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.