డిసెంబర్ 1 నుంచి మీ స్మార్ట్ఫోన్కు OTP లు రావొచ్చు లేదా రాకపోవచ్చు! 26 d ago
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్కామ్లు, ఆన్లైన్ ఫ్రాడ్ల నుంచి ప్రజలను రక్షించేందుకు కొన్ని చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 1 నుంచి మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లకు కొత్త నిబంధనలు విధించింది.
ఈ కొత్త నిబంధన ప్రకారం, టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ తమ నెట్వర్క్లో పంపించే ప్రతి కమర్షియల్ మెసేజ్, OTP మెసేజ్లను ట్రాక్ చేయాలి. ఈ కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్లైన్ బుకింగ్లు వంటి పనులకు ఎక్కువ సమయం పట్టవచ్చు.
ట్రాయ్ ఈ నిబంధనను అమలు చేయడం వల్ల స్పామ్ ఎస్ఎంఎస్లు, ఫిషింగ్ దాడులను తగ్గించవచ్చు. అయితే ఈ కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత కొంతకాలం OTP మెసేజ్లు లేట్గా రావచ్చు.