తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదు..! 18 h ago
AP : తిరుపతిలో గత రాత్రి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కులో ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదుతో ఒక కేసు నమోదైంది. విష్ణునివాసం వద్ద ఘటనపై బాలయ్యపల్లె తహసీల్దార్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది.