తిరుమలలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం..! 9 h ago
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు టోకెన్ భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు. తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది. గోవింద నామస్మరణతో తిరుమల కొండ మారుమోగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు.. స్వర్ణరథంపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం కార్యక్రమం జరగనుంది. రేపు ఉదయం 5:30 గంటలకు చక్రస్నాన మహోత్సవం జరగుతుందని అధికారులు తెలిపారు.