Vikram: 'వీర ధీర శూరన్ పార్ట్ 2' ఆలస్యంపై స్పందించిన విక్రమ్ 12 d ago

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం 'వీర ధీర శూరన్ పార్ట్ 2' మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా విడుదల విషయంలో ఆలస్యం జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా చాలా మల్టీ ప్లెక్స్‌లలో ఈ సినిమా మార్నింగ్ షోలు రద్దు అయ్యాయి.ప్రేక్షకులకు, విక్రమ్ క్షమాపణలు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆలస్యం జరిగిందంటూ వస్తోన్న పుకార్లను ఖండించారు. విలువలేని ఆరోపణలు చేయవద్దన్నారు. చివరి నిమిషంలో సినిమా విడుదలను ఆపాల్సి వచ్చింది. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. సినిమా ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు.