India vs West Indies: వెస్టిండీస్ పై భారత మహిళా జట్టు క్లీన్ స్వీప్.. 9 d ago
భారత మహిళా జట్టు విండీస్‌తో టీ20 సిరీస్‌ను, మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం వెస్టిండీస్ పై జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన వేళ భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత విండీస్ ను 162కే కట్టడి చేసిన టీమ్ ఇండియా, లక్ష్యఛేదన ఆరంభంలో కాస్త తడబడినా 28.2 ఓవర్లలో టార్గెట్‌ని ఛేదించింది. దీప్తి శర్మ (39*; 48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్ ప్రీత్ కౌర్ (32; 22 బంతుల్లో 7 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (29) రాణించారు. చివర్లో రిచా ఘోష్ (23*; 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) దూకుడుగా ఆడింది. రిచా వరుసగా రెండు సిక్సర్లు బాది భారత్ కు సూపర్ విక్టరీని అందించింది.