మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం : సీఎం రేవంత్ 12 h ago
TG: మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, తమ ప్రభుత్వం వచ్చాక పథకాలు మహిళల పేరు మీదే ఇస్తున్నామని వెల్లడించారు. మహిళల కోసం చట్టాలు చేస్తే ప్రభుత్వాల బాధ్యత తీరిపోదని, వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడిపిస్తున్నామని తెలిపారు.