Vivo T4x vs Infinix Note 50x vs Realme P3: రూ.15 వేల లోపు 5G స్మార్ట్‌ఫోన్‌లు… ఏ ఫోన్ కొనాలి? 12 d ago

ఇటీవల కాలంలో 5G ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీనికి తగినట్టుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఆటోమొబైల్ మార్కెట్లో కూడా ఈ 5G ఫోన్లకు పోటీ బాగా పెరిగిపోయింది. అయితే కొన్ని కంపెనీలు రూ.15 వేల లోపే మంచి ఫోన్లను అందిస్తున్నాయి. Vivo T4x, Realme P3 మరియు Infinix Note 50x సరసమైన ధరలో మంచి ఫీచర్లను అందిస్తున్నాయి. ఒకసారి ఈ ఫోన్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vivo T4x:
Vivo T4x ఫోన్‌లో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ బ్యాటరీ చెప్పుకోతగినది. 6500mAh కెపాసిటీతో ఈ ఫోన్ ఛార్జింగ్ రోజంతా వస్తుంది. ఈ ఫోన్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం.
Specifications:
డిస్‌ప్లే: 6.72-అంగుళాల Full HD+ LCD
రిఫ్రెష్ రేట్: 120Hz & 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
సాఫ్ట్‌వేర్: Android 15, Funtouch OS
ప్రాసెసర్: MediaTek Dimensity 7300
బ్యాటరీ: 6500mAh, 44W ఫాస్ట్ ఛార్జింగ్
కెమెరాలు: 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP సెల్ఫీ కెమెరా
డ్యూరబిలిటీ: మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్, IP64 రేటింగ్ (వాటర్ ప్రూఫ్)
Infinix Note 50x:
Infinix ఫోన్లు తక్కువ ధరలో చాలా అద్భుతంగా ఉంటాయి. Infinix Note 50x అనేది చాలా తక్కువ ధరలో మంచి ఫోన్. పెద్ద డిస్‌ప్లే, మంచి పనితీరు.. శక్తివంతమైన బ్యాటరీతో వస్తుంది. ఫోటోలు తీయడానికి కూడా మంచి కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం.
Specifications:
డిస్‌ప్లే: 6.67-అంగుళాల HD+ IPS LCD
రిఫ్రెష్ రేట్: 120Hz & 672 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
సాఫ్ట్‌వేర్: Android 15, XOS 15
రిఫ్రెష్ రేట్: 120Hz & 672 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్: MediaTek Dimensity 7300 Ultimate
బ్యాటరీ: 5500mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్
కెమెరాలు: 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP సెల్ఫీ కెమెరా
డ్యూరబిలిటీ: సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP64 రేటింగ్ (వాటర్ ప్రూఫ్)
Realme P3:
Realme ఫోన్లు సాధారణంగా చాలా బాగుంటాయి. మంచి మంచి ఫీచర్లతో అద్భుతమైన ఫోన్లను అందిస్తుంది. Realme P3 రూ.15 వేల లోపు చాలా మంచి ఫోన్. ఈ ఫోన్ స్క్రీన్ చాలా స్పష్టంగా, పెద్దగా ఉంటుంది. శక్తివంతమైన బ్యాటరీ, మంచి పనితీరు... అదిరిపోయే కెమెరా ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం.
Specifications:
డిస్‌ప్లే: 6.67-అంగుళాల AMOLED
రిఫ్రెష్ రేట్: 120Hz & 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్: Snapdragon 6 Gen 4
బ్యాటరీ: 6000mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్
కెమెరాలు: 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరా
సాఫ్ట్‌వేర్: Android 15, realme UI
ఏ ఫోన్ సరైన ఎంపిక ?
మీరు తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలంటే.. Infinix Note 50x ఉత్తమ ఎంపిక. ఇది కేవలం రూ.10,499 కే వస్తుంది. ఈ ఫోన్ ఫీచర్లు కూడా బాగున్నాయి కానీ HD+ డిస్‌ప్లే.. అలాగే లో- బ్రైట్‌నెస్ కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు.
మీకు బ్యాటరీ ఎక్కువసేపు రావాలంటే.. Vivo T4x మంచి ఎంపిక. ఇది 6500mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది మరియు రూ. 13,999 ధరతో బడ్జెట్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.
మీకు స్క్రీన్, కెమెరా చాలా ముఖ్యమైతే.. Realme P3 మంచి ఎంపిక. Realme P3 అన్నింటికంటే ఉత్తమమైన డిస్‌ప్లే, కెమెరా మరియు IP69 రేటింగ్‌తో వస్తుంది... కానీ దీని ధర ఎక్కువ. మొదట్లో రూ.15 వేలు ఉన్నా ఇప్పుడు రూ.16,999 పలుకుతుంది. Snapdragon ప్రాసెసర్ కూడా దీని ధర పెరగడానికి ఒక కారణం.
చూశారుగా Vivo T4x, Realme P3 మరియు Infinix Note 50x ఫోన్ల ఫీచర్లు ఎలా ఉన్నాయో. ఒక్కొక్క ఫోన్ కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇక మీరే నిర్ణయించుకోండి.. ఏ ఫోన్ తీసుకుంటే మీకు సౌకర్యంగా ఉంటుందో. ప్రస్తుతానికి ఈ మూడు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి.
ఇది చదవండి: రూ.12 వేల లోపు 5G ఫోన్ కావాలా? అయితే ఒకసారి ఇన్ఫినిక్స్ నోట్ 50X చూడండి.!