IND vs AUS: టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 112/3..! 6 d ago
మెల్బోర్న్ టెస్టును డ్రా చేసుకొనేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీ బ్రేక్ సమయానికి టీమ్ ఇండియా 54 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజ్లో యశస్వి జైస్వాల్ (63*), రిషబ్ పంత్ (28*) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 79 పరుగులు పార్ట్‌న్నర్‌షిప్ అందించారు. ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఇంకా 228 పరుగులు చేయాలి. చివరి సెషన్లో 38 ఓవర్ల ఆట కొనసాగే అవకాశం ఉంది. అంతకుముందు ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (9)తోపాటు విరాట్ కోహ్లి (5) మరోసారి విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ (0) డక్ అవుట్ గా వెనుదిరిగాడు. కమిన్స్ 2, స్టార్క్ ఒక వికెట్ తీశారు.