Nitish Kumar: టెస్టుల్లో తొలి హాఫ్ సెంచరీ చేసిన నితీష్.. 8 d ago
మెల్బోర్న్ టెస్టులోనూ భారత్ ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. దీనికి కారణం తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీతోనే టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో పుష్ప సినిమాలోని 'తగ్గేదేలే' మేనరిజంతో సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుత నితీష్ కుమార్ 85 పరుగులతో ఉండగా అతడితోపాటు వాషింగ్టన్ సుందర్ 40 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్ 105 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించారు. భారత్ స్కోరు 326 పరుగులతో ఉండగా ఇంకా 148 పరుగులతో వెనకబడి వున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.