సినిమాల కోసం ఎప్పుడూ కలలు కనలేదు- పవన్ 1 d ago
AP : అల్లూరి జిల్లాలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. గంజాయి పూర్తిగా వదిలేవరకు గిరిజనులను వదలనని అన్నారు. ఆడబిడ్డల జీవితాలు బాగుపడే వరకు రిటైర్ అవ్వనని చెప్పారు. సినిమాల కోసం ఎప్పుడూ కలలు కనలేదన్నారు. పేదల జీవితాలు మెరుగుపరచడం నా కల అని వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు అపార అనుభవం ఉందన్నారు. సీఎం ఎవరనేది కాదు.. ఎవరు బాగా పనిచేశారనేది ముఖ్యమని వ్యాఖ్యానించారు. నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని పవన్ పేర్కొన్నారు.