మేం అధికారంలో ఉన్నంతకాలం మీ ఆటలు సాగవు -రేవంత్ 1 d ago
రేవతి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఇకపై బెనిఫిట్ షోలు లేవు..ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని,
తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇవ్వమని రేవంత్ పేర్కొన్నారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి..ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకోమన్నారు. మేం అధికారంలో ఉన్నంతకాలం మీ ఆటలు సాగవని రేవంత్ చెప్పారు.