Tips To Reduce Asthma: ఆస్తమా తీవ్రతను తగ్గించే చిట్కాలు.! 1 y ago

featured-image

ఆస్త‌మా నివార‌ణ‌కు ఇంటి చిట్కాలు

దీర్ఘకాలిక సమస్య అయిన ఆస్తమాకు శీఘ్ర ఉపశమనం అందించటం కష్టం. అయితే, ఆస్తమా తీవ్రతను తగ్గించ‌డానికి స‌హాయపడే కొన్ని హోం రెమిడీస్ వున్నాయి. వాటిని అనుసరిస్తే మరింత బలమైన ఫలితాలు సాధించవచ్చు.


 

వాము:

కొన్ని వాము ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని ఆవిరిగా పీల్చటం ద్వారా శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, తద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. 


డీప్ బ్రీతింగ్:

ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు అయిన బ్రీతింగ్ ఎక్సరసైజ్ లు, ఆసనాలు వేసి శ్వాస పీల్చడం లాంటివి చేయడం ద్వారా వాయు నాళాల్లోని అడ్డంకులు తొలగిపోయి, ఆస్తమా లక్షణాలు మెరుగవుతాయి.

 

అతి మధురం: 

అతి మధురాన్ని నీటిలో కలిపి తాగటం ద్వారా ఆస్తమా లక్షణాలు త్వరగా తగ్గవచ్చు. అయితే, త్రాగడానికి ముందుగానే ఒక‌సారి వైద్యుడిని సంప్రదించడం మంచిది.

  


లవంగాలు:

లవంగాలతో చేసిన కషాయాన్ని తాగటం ద్వారా ఆస్తమా నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ క‌షాయాన్ని లవంగం పొడి మరియు తులసి ఆకుల‌ను కలిపి తయారు చేస్తారు.

 

వైద్యుడిని సంప్రదించండి: 

ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించండి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా నిద్రలో గురక వంటి లక్షణాలు ప్రమాదకర ప‌రిస్థితుల‌కు దారి తీయ‌వ‌చ్చు.

 



గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.



 కడుపు నొప్పి తరచూ వస్తుందా? మీకు ఉపశమనం కలిగించే కొన్ని చిట్కాలు!

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD