Jagan: రైతుల హక్కుల కోసం పోరాటం...వైసీపీ! 1 y ago
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు చేరుకున్నారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను కలవనున్నారు. అనంతరం మిర్చి మార్కెట్ యార్డును సందర్శించనున్నారు. జగన్ రాకతో ఎన్నికల నిబంధనలు ఉన్నా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. అడుగడుగున జగన్ కు నీరాజనాలు పడుతున్నారు.
అయితే మరో పక్క ఎన్నికల కోడ్ ఉండటంతో మిర్చి యార్డులో జగన్ పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. మిర్చి యార్డులో రాజకీయ ఫొటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిషేధం అంటూ ఇప్పటికే మైకులో ప్రచారం చేశారు. అనుమతులు లేకుండా వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇక దీనిపై కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో పండించే ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకే జగన్ ఈ పర్యటన చేపట్టారని చెప్పారు. కానీ నిత్యావసర సరుకులు రేట్లు మాత్రం పెరిగిపోయాయని చెప్పారు.
కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు రైతులు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టపోతున్నామని చెప్పారు. గిట్టుబాటు ధరపై అధికారులు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. తమ గోడు చెప్పుకోవడానికి ఒక్కరూ కూడా రావడం లేదని బాధపడ్డారు. ఈ ప్రభుత్వానికి రైతులపై అవగాహన లేదన్నారు.