సమాజంలో ట్రాన్స్‌జెండర్లు వివక్షకు లోనవుతున్నారు- సీపీ సీవీ ఆనంద్ 20 h ago
TG : హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో సోమవారం నుంచి ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో శిక్షణ పొందిన 39 మంది ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించిన ట్రాఫిక్ గుర్తులు, డ్రిల్ నిర్వహించారు. ఈ మేరకు.. సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కుటుంబం, సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఎంతో వివక్షకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాలని, వారిని సమాజంతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో మొదటి సారిగా వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ విభాగంలో హోంగార్డు క్యాడర్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు.